కొందరు శరీర కోరికలు తీర్చుకోడానికి, కొందరు గతిలేని పరిస్థితుల వల్ల, కొందరు తమకు తెలియకుండా, కొందరు డబ్బు కోసం, కొందరు కనీస అవసరాల కోసం, కొందరు ఉచ్చులో పడి, కొందరు మోసపోయి, కొందరు ప్రేమ పేరుతో, కొందరు వాంఛల పేరుతో, కొందరు ఉండబట్టలేక, కొందరు అన్నీ ఎక్కువై, కొందరు ఏమీ లేక అలా రకరకాల వ్యక్తులు రకరకాల కారణాల వల్ల రంకు పెట్టుకుంటారు. ఎవరిది తప్పో, ఎవరిది ఒప్పో సమాజం నిర్ధారిస్తుంది. సమాజం నిర్దారించింది మొత్తం మంచేనని చెప్పలేము. ఒక ప్రాంతపు సమాజానికి, ఒక వర్గపు సమాజానికి, ఒక కులపు సమాజానికి, ఒక మతపు సమాజానికి తేడాలు ఉంటాయి. అలాగే సమాజంలో ఉండే అందరూ ఒకేలా ఉండరు. ఎవరి నిర్ధారణ వారిది, ఎవరి విధానం వారిది, ఎవరి రంకు వారిది. రంకు కేవలం ఆడవారే పెట్టుకుంటారని నీచంగా ఆలోచించడం సమాజం వదిలేయాలి. రంకు ఒక్కరిది కాదు, ఒక జాతిది కాదు. స్త్రీలను లంజలుగా ముద్రించిన రంకు మగవారికి ఎలాంటి తిట్టు పెట్టకపోవడం గమనార్హం. లంజ అంటే ఇద్దరూ లేదా అంతకంటే ఎక్కువమందితో శారీరకంగా గడిపే మహిళను అంటారు. మరి మగవాడికి ఎలాంటి సంబోధన లేదే? లంజాకొడకా అనే తిట్టులో కూడా స్త్రీ ఉంది. ఈ రంకు స్త్రీల రంకు మాత్రమే కాదు, పురుషుల రంకు కూడా. స్త్రీలు మాత్రమే రంకు చేయరు, పురుషులు కూడా రంకు చేస్తారు. రంకుకు ప్రధాన కారకులు, ప్రేరకులు స్త్రీ-పురుషులే. ఇందులో ఏ ఒక్కరినో నిందించలేము.
జాని తక్కెడశిల
కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత
Raṅku
- Johny Takkedasila
- All items are non returnable and non refundable