హలో ఎవరమ్మా?' 'ఉదయం మీరే నాకు కాల్ చేశారండి' "ఏంటి.. మీ పేరు "లై" నే కదా?" 'అవునండీ' ("లై" నా మరో కలం పేరు) నా పేరు "శివారెడ్డి" అనగానే నోట మాట రాలేదు. మన్నించండి సార్, గుర్తు పట్టలేకపోయాను అన్నాను. నిజానికి శివారెడ్డి గారితో మాట్లాడటం అదే మొదటిసారి. చాలా బాగా రాశావయ్యా! ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభలో కూడా సమీక్షలు వచ్చాయి కాని నీ సమీక్షలో నా గురించి, నా కవిత్వం గురించి నీవు ప్రస్తావించిన పద్యాలు చాలా బాగున్నాయి. ఆ పుస్తకం ఎక్కడ దొరికింది నీకు? ఇప్పుడు అందుబాటులో లేదే అన్నారు. జరిగిన కథ మొత్తం చెప్పాను. నీతో మాట్లాడాలి, వీలైతే ఒకసారి హైదరాబాద్ కి రాగలవా? అన్నారు. తప్పకుండా సార్, నాకు మీ పుస్తకాలు కావాలన్నాను. సరే బంగారు, నువ్వు వచ్చే ముందు నాకు ఫోన్ చేసి రావాలన్నారు. తరువాతి వారమే హైదరాబాద్ వెళ్ళాను.
Sivareddy Kavitvam Oka Parisheelana
$11.50Price
- Johny Takkedasila
- All items are non returnable and non refundable